calender_icon.png 29 August, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తపాలా బీమా, సుకన్య సమృద్ధి యోజన పథకాలపై ప్రజలకు అవగాహన

29-08-2025 05:44:42 PM

ఇంటింటికి తిరిగి తపాలా బీమా, సుకన్య సమృద్ధి యోజన పథకాలపై ప్రజలకు అవగాహన 

కుభీర్,(విజయక్రాంతి): భారతీయ తపాలా జీవిత బీమా అనేది ఇండియా పోస్ట్ అందించే వివిధ రకాల జీవిత బీమా పథకాలకు సంబంధించినదని ఇది భారతీయ పౌరులకు ఆర్థిక భద్రతను కల్పించేందుకు దోహద పడుతుందని కుభీర్ పోస్ట్ ఆఫీస్ సీనియర్ బీపీఎం పుప్పాల రాజేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అసిస్టెంట్ బీపీఎం బీ.నవీన్ తో కలిసి నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి (కే) గ్రామంలో గ్రామస్తులకు భారతీయ పోస్టల్ బీమా పథకాలపై అవగాహన కల్పించారు. రోజువారితో పాటు క్వార్టర్లీ, ఆఫ్ ఇయర్లీ, ఇయర్లీ ప్రీమియం చెల్లించు కోవచ్చన్నారు.  ఆ పేర్లు ఇయర్లీ ఈ పథకాలు గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం రూపొందించబడ్డాయి.

వీటికి పెట్టుబడితో పాటు బీమా యొక్క ద్వంద్వ ప్రయోజనాలను అందిస్తాయి. ఈ పథకాలు పాలసీదారులకు జీవిత బీమాతో పాటు, మనీ-బ్యాక్, ఎండోమెంట్, మరియు మొత్తం జీవిత బీమా వంటి ప్రయోజనాలను అందిస్తాయి. ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు 1. సుకన్య సమృద్ధి యోజన, 2. గ్రామీణ తపాలా బీమా(Rural Postal Insurance), 3. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్(Postal Life Insurance)తో పాటు రికరింగ్ డిపాజిట్(RD), నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (NSC), కిసాన్ వికాస  పత్రం పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.