18 April, 2026 | 1:37 PM

నేటి నుంచే సింగరేణిలో ప్లాస్టిక్ బంద్

06-06-2025 12:33 AM

హైదరాబాద్, జూన్  5 (విజయక్రాంతి): సింగరేణి, హైదరాబాద్ కార్యాలయంతో పా టు సింగరేణిలోని అన్ని ఏరియాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని సంపూర్ణంగా నిషేధిస్తున్నట్లు సంస్థ సీఎండీ బలరాం ప్రకటించారు.  ప్లాస్టిక్ బాటిల్స్ మొత్తానికే వినియోగించొద్దన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో గురువారం ఆయన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి మాట్లాడారు.

సింగరేణి సంస్థలో ఇప్పటికే పలు రకాల పర్యావరణహిత చర్యలు చేపడుతున్నామని, కొన్నిచోట్ల ప్లాస్టిక్ వాడటం తగ్గించినట్లు తెలిపారు.అయినా ఈ ఏడాది ఇచ్చిన ప్రపంచ పర్యావరణ నినాదాన్ని అనుసరించి సింగరేణి  కార్యాలయాలు, గనులు, డిపార్ట్ మెంటులలో ప్లాస్టిక్ తో తయారుచేసిన బాటిల్స్, ప్లేట్లు, వస్తువులపై ఇక సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు  ప్రకటించారు.