calender_icon.png 14 August, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలి

13-08-2025 10:10:39 PM

- లోతట్టు ప్రాంతాల్లో ఎవరు ఉండకూడదు 

- అధికారుల నిఘా పక్కాగా ఉండాలి 

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) సూచించారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మహబూబ్ నగర్ లో, మహబూబ్ నగర్ మండలం, హన్వాడ మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన చోట పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అత్యవసర పరిస్థితులు నెలకొన్న తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,  కార్యకర్తలు  గ్రామ అధ్యక్షులు తమతమ గ్రామాల్లోనే ఉండి శిథిలావస్థలో ఉన్నటువంటి ఇండ్లలో ఉన్న వ్యక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ప్రజలు కూడా అత్యవసరమైన  పనులు ఉంటే కాని బయటికి వెళ్ళకూడదని తెలియజేశారు.