25-08-2025 05:38:40 PM
బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కి లబ్ధిదారుల మొర
బెల్లంపల్లి అర్బన్: పట్టణంలోని ఎల్లమ్మ గుడి ప్రాంతంలోని గతంలో ఇచ్చిన ఇందిరమ్మ స్థలాలను కొందరు ఆక్రమించుకుంటున్నారని లబ్ధిదారులు బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను కలిసి మొరపెట్టుకున్నారు. సోమవారం భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు దార కళ్యాణి ఆధ్వర్యంలో బాధితులు సబ్ కలెక్టర్ ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. 2007-2014 కాలంలో బెల్లంపల్లి పట్టణ (అర్బన్)కి సొంత స్థలం లేకపోవడంతో అప్పటి ప్రభుత్వం ఇంద్రమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులకి బెల్లంపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్ పక్కనగల ఎల్లమ్మ గుడి 170పీపీ లో స్థలాలు కేటాయించిందని తెలిపారు.
34 వార్డుల్లోనీ పేదలు కేటాయించిన ఇంద్రమ్మ ఇండ్లు పట్టుకున్నారని తెలిపారు. వాటితో పాటు ఖాళీ ఇండ్లను, స్థలాలను ఆక్రమిస్తున్నారని తెలిపారు. కట్టుకున్న ఇళ్లను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చి వేసి అక్రమిస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ లబ్ధిదారులు తమకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాల కోసం తహసిల్దార్, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో పర్మిషన్ కోసం పెట్టుకున్న దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయని వాపోయారు. కబ్జాకోరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని సబ్ కలెక్టర్ కి లబ్ధిదారులు వివరించారు.