25-08-2025 05:31:25 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని బాట్వాన్ పల్లి, పెరిక పల్లి, గుండ్ల సోమారం ఆటో స్టాండ్ సమస్యలపై సోమవారం ఆటో డ్రైవర్లు బెల్లంపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు వినతిపత్రం అందజేశారు. గత కొన్నేళ్లుగా మార్కెట్ ఎదురుగా ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకొని వివిధ గ్రామాలకు వెళ్లే ప్రజలకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. మున్సిపల్ అధికారులు తమ ఆటో స్టాండ్ నుండి లోపల చదును చేసే భూమి కొరకు దారి కావాలని ఒత్తిడి తీసుకు వస్తున్నారని వినతిపత్రంలో తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆటో స్టాండ్ స్థలాన్ని కాపాడతానని డ్రైవర్లకు హామీ ఇచ్చారు.