calender_icon.png 27 July, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

25-07-2025 01:09:16 AM

  1. కలెక్టర్ రాజర్షి షా ఆదేశం

శివసాగర్ ప్రాజెక్ట్ పరిశీలన

ఆదిలాబాద్, జూలై 24 (విజయక్రాంతి): జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో గురువారం కలెక్టర్ రాజర్షి షా ఉట్నూర్ మండలం నాగపూర్ శివసాగర్ ప్రాజెక్ట్, పులి మడుగు బ్రిడ్జి, ముత్నూరులోని కల్వర్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా అతి భారీ వర్షాలు కురిస్తే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నందున ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

లోతట్టు ప్రాం తాల్లో  ప్రజలు ఇబ్బందులు పడకుండా తగి న సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, ఎక్కడ కూడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులము ఆదేశించారు. అనంతరం ఉట్నూర్ PACS కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా రైతులకు యూరియా సరఫరా చేస్తున్న  తీరుపై అరా తీశారు. యూరియా స్టాక్ ను పరిశీలించి ఇండెంట్ ఎప్పటికప్పుడు పంపించి స్టాక్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ యువరాజ్, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారి విఠల్, డిప్యూటి ఇంజనీర్ వినోద్, ఏఈలు ఉన్నారు.