16-10-2025 07:03:15 PM
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండల ఉపాధి హామీ ఏపీఓగా ఎంపీడీఓ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బి యాదమ్మ గురువారం ఏపీఓగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ ఆదేశాల మేరకు ఎంపీడీఓ గోపి యాదమ్మకు ఏపీఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఏపీఓ మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులకు జాబ్ కార్డు మంజూరు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ రామకృష్ణ,జూనియర్ అసిస్టెంట్ శిల్పిక,టీఏ నాగమణి,సీఓ సుధీర్ రెడ్డి,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.