calender_icon.png 16 October, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీధి కుక్కల దాడిలో పలువురికి గాయాలు

16-10-2025 06:46:58 PM

మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని పాత దొనబండ తండా గ్రామానికి చెందిన పలువురు గురువారం కుక్కల దాడిలో గాయపడ్డారు. వివిధ పనుల నిమిత్తం వెళ్తున్న సమయంలో వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయని బాధితులు వాపోయారు. గాయపడ్డ వారిని హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి చికిత్స తరలించారు. మఠంపల్లి మండల వ్యాప్తంగా కుక్కలు స్వైరవిహారం చేస్తూ దాడులకు పాల్పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల నియంత్రణ కొరకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.