16-10-2025 06:43:31 PM
కృత్రిమ ఇసుక తయారు చేస్తే కఠిన చర్యలు..
తలకొండపల్లి: కృత్రిమంగా ఇసుకను తయారుచేసి అమ్ముకుంటున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తలకొండపల్లి ఎస్సై శ్రీకాంత్ హెచ్చరించారు. తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామంలోని వ్యవసాయ పొలాల వద్ద ఇసుక ఫిల్టర్లను ఏర్పాటు చేసి కృత్రిమంగా ఇసుకను తయారు చేస్తున్నట్లు సమాచారం పోలీసులకు అందింది. వెంటనే స్పందించిన ఎస్సై శ్రీకాంత్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రావణ్, పోలీస్ సిబ్బందితో గురువారం ఇసుక ఫిల్టర్లపై దాడులు నిర్వహించి జెసిబిల ద్వార ధ్వంసం చేశారు. కృత్రిమ ఇసుక దారులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీకాంత్, ఆర్ఐ శ్రావణ్ లు తెలిపారు.