calender_icon.png 16 October, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేద వర్గాల భరోసా

16-10-2025 07:01:30 PM

కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు

68 మంది లబ్దిదారులకు రూ.33.68 లక్షల విలువచేసే చెక్కులు అందించిన ఎమ్మెల్యే

కొత్తగూడెం (విజయక్రాంతి): అత్యవసర పరిస్థితిలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకొని ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న పేదవర్గాల ముఖ్యమంత్రి సహాయనిధి పథకం భరోసా అని, ఈ పథకాన్ని పేదప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసికోవాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్'లో గురువారం  సిఎం రిలీఫ్ ఫండ్ పథకంలో 68 మందికి మంజూరైన రూ.33.68 లక్షల విలువైన చెక్కులను లబ్దిదారులకు అందించారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ ఈ పథకంలో ప్రభుత్వం మంజూరు చేస్తున్న డబ్బుల శాతం చాలా తక్కువగా ఉంటోందని, చెల్లింపు శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

పథకం మంజూరులో ఆస్పత్రుల నుంచి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని, దీన్ని అధిగమించేందుకు ఆస్పత్రుల యాజమాన్యాలకు అవగాహన కల్పించాలని, అనుమతులు లేని ఆస్పత్రుల వలన పథకం అమలయ్యే పరిస్థితులు ఉండటం లేదని, ఇలాంటి ఆస్పత్రులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.  కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు భూక్యా దస్రు, కంచర్ల జమలయ్య, మండల కార్యదర్శి కొమారి హన్మంతరావు, నాయకులు జక్కుల రాములు, పొదిల శ్రీనివాస్, ఎండి యూసుఫ్, మూడ్ గణేష్, మురళి తదితరులు పాల్గొన్నారు.