calender_icon.png 10 May, 2025 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని మోదీ సీడీఎస్ సమావేశం

10-05-2025 02:46:02 AM

  1. హాజరైన త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు దోవల్
  2. భారత పౌరులపై పాక్ దాడులను ఉపేక్షించొద్దు: రాజ్‌నాథ్ సింగ్
  3. ఎల్వోసీ వద్ద ప్రతిదాడులకు వెనుకాడొద్దు

న్యూఢిల్లీ, మే 9: నూఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)తో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ అండ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా)చీఫ్ రవి సిన్హా, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ డేకా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని దేశ భద్రత అంశంపై సూచనలు, సలహాలు ఇచ్చారు.

అనంతరం రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత సరిహద్దు ప్రాంతాలతో పాటు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద పాకిస్థాన్ డ్రోన్ దాడులు చేస్తున్నదని, వాటిని సైన్యం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భారత పౌరులపై దాడులను ఉపేక్షించొద్దని ఆదేశించారు. పాక్‌పై ప్రతిదాడులకు వెనుకాడొద్దని సూచించారు. అనంతరం త్రివిధ దళాధిపతులు గడిచిన 48 గంటల్లో తీసుకున్న చర్యలపై ప్రధాని మోదీకి వివరించారు. పాక్ చేస్తున్న దాడులు, వాటిని భారత్ సైన్యం తిప్పికొడుతున్న చర్యలపై బ్రీఫింగ్ ఇచ్చా రు.

ప్రధాని అలాగే అంతర్జాతీయంగా ఏయే దేశాలు భారత్‌కు మద్దతు ఇస్తున్నాయి..? పాకిస్థాన్‌కు ఏయే దేశాలు మద్దతు ఇస్తున్నాయనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు ఇవ్వడం, ఆయుధ సామగ్రి సమకూర్చడంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే  దేశ సరిహద్దు ప్రాంతాల్లో  నెలకొన్న పరిస్థితులపై ప్రధాని ఆరా తీశారు.