calender_icon.png 2 September, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినాయక నిమజ్జనంలో డీజేల వాడకం పూర్తిగా నిషేధం

02-09-2025 02:42:02 PM

సదాశివనగర్ (విజయక్రాంతి): వినాయక నిమజ్జన శోభయాత్రలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం డీజేలకు ఎటువంటి అనుమతి లేదని ఎస్ఐ పుష్పరాజ్(SI Pushparaj) అన్నారు. మండలంలో ఏ గ్రామంలో కూడా డీజేలతో నిమజ్జనం చేస్తే వారిపై కేసులు నమోదు చేయబడతాయని అయన స్పష్టం చేశారు. డీజే ఆపరేటర్లకు ముందస్తు అడ్వాన్సులు ఇవ్వవద్దని సూచించారు. ప్రజలందరూ అర్థం చేసుకొని పోలీసులకు సహకరించగలరని మనవి.