02-09-2025 02:50:03 PM
సూర్యాపేట (విజయక్రాంతి): ఇంటర్నేషనల్ స్థాయిలో జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్(Pro Kabaddi League) పోటీలకు టెక్నికల్ అఫిషియల్ అంపైర్ గా జిల్లాలోని గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన కొంపెల్లి వీరస్వామి ఎన్నికైనట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శిలు అల్లం ప్రభాకర్ రెడ్డి, నామా నరసింహ రావులు మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ క్రీడాకారుడికి ఇంత మంచి గుర్తింపురావడం గర్వకారణం అన్నారు. అలాగే ఎంపికకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ బాధ్యులు కాసాని వీరేష్, మహేందర్ రెడ్డి, రెఫెరీస్ బోర్డు చైర్మన్ సత్యనారాయణ, కన్వీనర్ అనిల్ కుమార్, టెక్నికల్ కమిటీ చైర్మన్ శ్రావణ్, ఇంటర్నేషనల్ ప్రో కబడ్డీ కోచ్ శ్రీనివాస్ రెడ్డి, రెఫెరీస్ బోర్డు కో కన్వినర్, ఇంటర్నేషనల్ ప్రో కబడ్డీ రెఫెరీ వి.శ్రీనివాస్ లకు అభినందనలు తెలిపారు.