calender_icon.png 2 September, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబద్దాలకోరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీద్దాం

02-09-2025 02:45:05 PM

ఖానాపూర్ మండలం బాదనకుర్తి వంతెనపై బీఆర్ఎస్ నిరసన

భారీగా నిలిచిపోయిన వాహనాలు

ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం అబద్దాలకోరు ప్రభుత్వమని ప్రజలను రైతులను నిండా ముంచి, అబద్ధపు హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని నిరసిస్తూ ఖానాపూర్ మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు తమ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు మండలంలోని బాదనకుర్తి గోదావరి నది వంతెనపై నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో సుమారు గంటన్నర పాటు భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ఆ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి రాజా గంగన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను నిలబెట్టుకునే దిశగా పాలన చేయడం మరిచిపోయి రాష్ట్రంలో కేసిఆర్ పేరుపై బురద జల్లడమే పనిగా పెట్టుకుందని కాలేశ్వరం ప్రాజెక్టుపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతుందని ఆ ప్రాజెక్టు తెలంగాణకు జీవనాధారం కాగా తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కంకణం కట్టుకొని కేసీఆర్ను కారణం లేకుండా దోషిగా నిలబెట్టేందుకు సర్వశక్తులు వడ్డుతుందని కేసిఆర్ శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు. రాష్ట్రం రాకముందు గోదావరిలో నెత్తురు పారితే ప్రస్తుతం కేసీఆర్ పాలన అనంతరం కూడా జలకల సంతరించుకోవడం కేవలం కేసీఆర్ పాలనతోనే సాధ్యమైందని వారు అన్నారు. పార్టీలకు అతీతంగా రైతులందరూ కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టిఆర్ఎస్ మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.