calender_icon.png 2 September, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్

02-09-2025 02:27:18 PM

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి సంచలన నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత(Kavitha)ను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పై కవిత తీవ్ర ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కేసీఆర్ పై కేసు పెట్టాక పార్టీ ఉంటే ఎంత..? పోతే ఎంత..? అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీతో కవిత విభేదిస్తున్న విషయం తెలిసిందే. కవిత తీరుపై పార్టీకి నష్టం కలిగిస్తుందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ. రవీందరర్ రావు ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతోనే సస్పెండ్ చేసినట్లు  రవీందరర్ రావు తెలిపారు.