02-09-2025 02:47:18 PM
అనంతగిరి: మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy) వర్ధంతి మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముత్తినేని కోటేశ్వరరావు వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ, 2009 సెప్టెంబర్ 2న దురదృష్టవశాత్తు నల్లమల్ల అడవుల్లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని, వైయస్ రాజశేఖర్ రెడ్డి మనకి దూరమై 16 ఏళ్లు అవుతున్నప్పటికీ వైఎస్ఆర్ ప్రజల పట్ల చూపిన అనురాగాన్ని ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు మర్చిపోలేదని ప్రజల గుండెలలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించాడన్నారు.
2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్తు ,ఏకకాలంలో రైతులకు రుణమాఫీ,మహిళలకు అభయస్తం వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి 2009లో రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రాజశేఖర్ రెడ్డి అదే ఏడాది మరణించడం దురదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్ బోడపూడి సత్యనారాయణ మాజీ ఉపసర్పంచ్ దేవ పంగు కృష్ణ కోటేశ్వరరావు సురేష్ శ్రీను అంజయ్య కుమార్ తదితరులు పాల్గొన్నారు