02-09-2025 02:57:11 PM
రామచంద్రపురం (విజయక్రాంతి): గతంలో ఉన్న డ్రైనేజీ సమస్యను నేటితో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చిన ప్రకారం ఈరోజు రామచంద్రాపురం డివిజన్ లో ఉన్న సాయి జ్యోతి నగర్ కాలనీ రోడ్ నంబర్ 7, 8లో సుమారు 30.00 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల నిమిత్తం జలమండలి మేనేజర్ లోకేష్, సిబ్బంది నాయక్, కాలనీ అధ్యక్షులు అశ్విన్ గౌడ్, వెంకట్ రెడ్డి, కాలనీ వాసులతో కలిసి జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు, రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ శంకుస్థాపన చేశారు. అలాగే కాలనీలో ఇంకా మిగిలి ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు దశల వారీగా పూర్తి చేస్తా అని హామీ ఇచ్చారు. అలాగే సీసీ రోడ్ కూడా మంజూరు చేయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అనంతరం సీసీ రోడ్ వేస్తా అని హామీ ఇచ్చిన కార్పొరేటర్. వారితో సత్తయ్య గౌడ్, రాజనర్సింహ, బలరాం,ప్రసాద్,శేఖర్ రెడ్డి,మురళి రెడ్డి,శ్రీనివాస్,మోహన్,ఆర్వీ రాజు,బేగరి పెంటయ్య,జహంగీర్,నీలి రాజు తదితరులు.