calender_icon.png 14 August, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నులి పురుగుల నివారణే ప్రభుత్వ లక్ష్యం

11-08-2025 12:35:29 AM

 ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్ చెరు, ఆగస్టు 10:  బాల బాలికల్లో నులి పురుగుల సమస్య నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జాతీయ ఫైలేరియా మరియు నులి పురుగుల నిర్మూలన కార్యక్ర మంలో భాగంగా పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన మాత్రల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రెండు విడతల్లో నులి పురుగు నివారణ మాత్రలు ప్రభుత్వం పంపిణీ చేస్తోందని తెలిపారు.   1-19 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలందరికీ  పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా వారి మొత్తం ఆరోగ్యం, పోషక స్థితి, విద్యకు ప్రాప్యత మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడం ద్వారా నులిపురుగులను తొలగించడం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ లక్ష్యమని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారిని నిర్మల, డాక్టర్ మనోహర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఆసుపత్రి అభివృద్ధి సంఘం సభ్యులు కంకర సీనయ్య, ఆసుపత్రి సిబ్బందిపాల్గొన్నారు.