calender_icon.png 14 January, 2026 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పతంగులు ఎగురవేసిన పోచారం

14-01-2026 05:37:06 PM

తెలుగువారి సంస్కృతి,సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ

బాన్సువాడలో  కైట్ ఫెస్టివల్లో పాల్గొని పతంగులు ఎగురవేసిన పోచారం, కాసుల

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం

బాన్సువాడ,(విజయక్రాంతి): తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండగ అని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సంక్రాంతి పండుగ సంబరాలలో భాగంగా బుధవారం కామారెడ్డి జిల్లా  బాన్సువాడ పట్టణంలోని వీక్లీ మార్కెట్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ (పతంగుల పండుగ)లో పాల్గొని పట్టణ వాసులు, చిన్నారులతో కలిసి కైట్ (పతంగి) ను ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రజా ప్రతినిధులతో కలిసి పతంగులను ఎగరవేశారు.

చిన్నారితో కలిసి గాలిపటాలని ఎగరవేయడం చాలా సంతోషంగా ఉందని కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో కుటుంబ సభ్యులతో పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు చిన్నారులు తదితరులు ఉన్నారు.