calender_icon.png 14 January, 2026 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమనీయం.. రమణీయం

14-01-2026 05:39:50 PM

గోదా రంగనాదుల కళ్యాణం

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పెరికెగిద్ద హనుమాన్ ఆలయంలో గోదా రంగనాథ స్వామి కల్యాణము వైభవంగా నిర్వహించారు. అర్చకులు కొండపలకల అభిలాష్ స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. అనంతరం ఆలయ చైర్మన్ ఆకుల రామేశ్వర్ రెడ్డి విజయలక్ష్మి దంపతులు గోదారి రంగనాయక స్వామి వారికి ఫుడ్, బియ్యం, నూతన వస్త్రాలు సమర్పించారు.

పలువురు మహిళలు గోదా అమ్మవారికి సారే కానుకలు సమర్పించారు. ఆలయ అర్చకులు కొండపక్కల అభిలాష్ స్వామి మాట్లాడుతూ దరువు మాస వ్రత విశిష్టత గురించి ఈ మాసంలో ఆచరించవలసిన తిరుప్పావై వ్రతం గురించి 30 పాశురాల గురించి భక్తులకు వివరించారు, 30 రోజులలో ఒక్కసారైనా పాశురాలను చూస్తే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి అని అన్నారు, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.