calender_icon.png 14 January, 2026 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌతం వాగ్మేర్‌కు ఘననివాళులు

14-01-2026 05:25:22 PM

వాంకిడి,(విజయక్రాంతి): మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టాలనే ఉద్యమంలో ఆత్మదహనం చేసుకున్న దళిత పాంథర్ నాయకుడు గౌతం వాగ్మేర్‌కు బుధవారం వాంకిడి మండల కేంద్రంలోని బుద్ధ విహార్‌లో ఘన నివాళులు అర్పించారు. అంబేడ్కర్ సంఘం, భారతీయ బౌద్ధ మహాసభ, రామబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, పంచశీలాలను ఆలపించి మౌనం పాటించారు. గౌతం వాగ్మేర్ చేసిన త్యాగం ఫలితంగానే మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పేరు పెట్టడం సాధ్యమైందని పలువురు నాయకులు కొనియాడారు. ఆయన పోరాటం దళిత ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు.