calender_icon.png 7 August, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచారం ప్రాజెక్టు నీరు విడుదల

06-08-2025 09:16:04 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పోచారం ప్రాజెక్టు(Pocharam Project) నుండి ప్రధాన కాలువలోకి 150 క్యూసెక్కుల నీటిని బుధవారం అధికారులు, ప్రజాప్రతినిధులు విడుదల చేశారు. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లో సాగుచేస్తున్న 12 వేల ఎకరాల పంటల కోసం పోచారం ప్రాజెక్టు నుండి, ఎల్లారెడ్డి ఆర్టీవో పార్థసింహారెడ్డి, నీటిపారుదల శాఖ డివిజన్ అధికారి వెంకటేశ్వర్లు, ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత, వెంకట్రామిరెడ్డి, నాగిరెడ్డిపేటలో నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్లో ప్రస్తుతం 17 అడుగుల నీరు నిల్వ ఉందని తెలిపారు. దీంతో ఏ– జోన్ ఆయకట్టుకు చెందిన 6,400 ఎకరాలకు, బీ జోన్లో 6000 ఎకరాలకు నీటిని విడుదల చేశారు.

15 రోజులు నీటిని అందించి 10 రోజులు నీటిని నిలుపుదల చేస్తూ 5 విడతల్లో పంటల సాగుకు నీటిని అందించనున్నారు. విడుదలైన నీటిని రైతులు  సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో పార్థ సింహారెడ్డి, నీటిపారుదల ఎస్ఈ మల్లేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ శ్రీనివాస్, ఎల్లారెడ్డి  మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, నాగిరెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , శ్రీధర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచందర్ రెడ్డి, వాసురెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దివిటి కిష్టయ్య, వేముల సంగయ్య, కర్ణాకర్ రెడ్డి,సురేందర్ తదితరులు పాల్గొన్నారు.