06-08-2025 09:07:20 PM
పటాన్ చెరు: అమీన్ పూర్ మున్సిపల్(Ameenpur Municipality) పరిధిలోని పటేల్ గూడ సిద్ధార్థ ఎన్‌క్లేవ్ కాలనీలో బుధవారం కట్ట మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిద పార్టీల నాయకులు హాజరయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు ఈర్ల రాజు, బీఆర్ఎస్ యువనేత మాదిరి పృథ్వీరాజ్, ఐలాపూర్ మాణిక్ యాదవ్, పటాన్ చెరు, అమీన్ పూర్ పట్టణ నాయకులు విగ్రహ ప్రతిష్టాపనకు హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దయతో ప్రజలందరు సంతోషంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.