calender_icon.png 31 October, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల రక్షణకే పోలీస్

31-10-2025 12:00:00 AM

పోలీస్ అమరుల సంస్కరణ వారోత్సవాల్లో సైకిల్ ర్యాలీ: ఎస్పీ శరత్‌చంద్ర పవర్

నల్గొండ క్రైమ్, అక్టోబర్ 30: ప్రజల రక్షణ కోసం పోలీసులు ప్రాణ త్యాగానికి సిద్ధపడతారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీనీ ప్రారంభించి న అనంతరం ఆయన మాట్లాడారు.పోలీస్ విధి నిర్వహణలో అమరులైన వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21ప్లాగ్ డే నిర్వహిస్తున్నామనీ, వారి త్యాగాల గుర్తుగా అమరవీరుల వారోత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు. 

శాంతి భద్రతల పరిరక్షణలో విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరులైన వారి ఆత్మ శాంతి కలగాలన్నారు. జిల్లా పోలీస్ ప్రజా రక్షణే ద్వేయంగా అనుక్షణం శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డిఎస్పి శివరాంరెడ్డి, ఏఆర్ డిఎస్పి శ్రీనివాసులు, సిఐలు రాఘవరావు, రాజశేఖర్ రెడ్డి, మహా లక్ష్మయ్య శ్రీను నాయక్ ఆర్ ఐలు సంతోష్, శ్రీను, సూరప్ప నాయుడు, హరిబాబు ఎస్త్స్రలు సైదులు, శంకర్, గోపాల్ రావు, వీరబాబు, శ్రావణి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.