calender_icon.png 20 May, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల పనులను ప్రారంభించాలి..

20-05-2025 06:06:21 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): అయ్యాం సాగర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పనులను రెండు రోజుల్లోగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి ప్రమీల(Mandal Special Officer Pramila) పేర్కొన్నారు. ఆమె మంగళవారం నాడు నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రారంభం కానీ ఇందిరమ్మ ఇళ్లకు రెండు రోజుల్లోగా ముగ్గుల పోయించి పనులు ప్రారంభించాలన్నారు. వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ పని జరుగుతున్న ప్రాంతాల్లో కూలీలకు నీడ వసతి ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని , ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయించి గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని సూచించారు. కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి గంగాధర్ అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.