11 August, 2026 | 1:11 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

దామరతోగులో పోలీసుల కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్

19-06-2025 12:36 AM

దామెరతోగు,నేతకాని గుంపు ఆదివాసీ ప్రజలకు దోమతెరలను పంపిణీ చేసిన గుండాల పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం/గుండాల ,జాన్ 18, (విజయ క్రాంతి)జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు బుధవారం గుం డాల మండలంలోని దామెరతోగు గ్రామంలో నేతకాని గుం పులో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం  నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ జి.నరేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ ప్రజలు మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించవద్దని తెలిపారు.

ప్రజ లు ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధి దిశగా పయనించాలన్నారు. అభివృద్ధిని అడ్డుకునే మావోయిస్టులకు సహకరించ వద్దన్నారు. మావోయిస్టులవి కాలం చెల్లిన సిద్ధాంతాలని తెలిపినారు. ఇల్లందు డిఎస్పి చంద్రభాను గారు మాట్లాడుతూ యువత,పిల్లలు విద్య ద్వారానే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు. అసాంఘీక శక్తులకు సహకరించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ అనవసరంగా కేసులు, జైలు పాలు కా వద్దని సూచించారు.

వర్షాకాలంలో తమ ఇండ్ల చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అధికంగా మురుగు నీరు చేరడం వలన దోమలు అధికమై డెంగ్యూ,మలేరియా, టైఫాయిడ్ వంటి విషపూరిత జ్వరాల బారిన పడే అవకాశం ఉందని అధికారులు సూచించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్, డిఎస్పి చంద్రబాను చేతుల మీదుగా అక్కడ నివసించే ప్రజలకు 50 దోమ తెరలను పంపిణీ చేశారు.

పిల్లలకు నోట్ బుక్స్,పెన్నులు పంపిణీ చేశారు. మొబైల్ నెట్వర్క్ సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.దోమతెరల పంపిణీకి సహకరించిన ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ మెంబర్ పాషా ను అడి షనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్ ప్రత్యేకంగా అభినందించా రు. ఈ కార్యక్రమంలో గుండాల సీఐ రవీందర్,ఎస్సై రవూఫ్ ,గుండాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.