calender_icon.png 10 October, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ చిట్టీలు నడిపిన వ్యక్తి ..

10-10-2025 12:16:54 AM

చిచ్ అమౌంట్ చెల్లించనందుకు జైలుశిక్ష 

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 9, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ప్రైవేటు చిట్టి లు నడిపి మోసం చేసిన వ్యక్తికి ఐదు సంవత్సరముల కారా గార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.

కేసు వివరాలు ఇలా కొత్తగూడెం బస్తి చెందిన ఎండి. నిజాముద్దీన్ స్థానికంగా గంగాభిషన్న భస్టికి చెందిన జక్కుల వెంకన్న తన కుటుంబంతో గత కొన్ని సంవత్సరంల నుండి నివాసం ఉన్నందున పరిచయాలు బాగా పెరిగినందున మనిషికి రూ.1లక్ష, రూ .1.50 లక్ష విలువగల చిట్లి లు నిర్వహించాడు.

తనతో పాటు ఎల్.సుధ,పరపతి ,లక్ష్మణ్ రెడ్డి, పేరం నరేష్ , కోలా, సాల్మన్ రాజు, పరపతి వీరబాబు, మణమ్మ ,పెరుమాళ్ళు నాగేశ్వరరావు మరికొందరు మొత్తం 20 మంది కలిసి అతని వద్ద చిట్టీలు వేయించుకొని ఎటువంటి బాకీలు లేకుండా చెల్లించినప్పటికిని మొత్తం రూ.16, 41,000/- చెల్లించకుండా మోసం చేసి పారిపోయాడని కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పటి ఎస్ ఐ. జి.తిరుపతికి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి అప్పటి ఇన్స్పెక్టర్ కే. కుమారస్వామి దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జి షీట్ దాఖలు చేశారు.

కోర్టులో 22 మంది సాక్షుల విచారణ అనంతరం జక్కుల వెంకన్న పై నేరం ఋజువు కాగా సెక్షన్ 420 ఐ.పి.సి. ప్రకారం ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష , రూ.3,000/- ల జరిమానా, సెక్షన్ 5 తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్,1999 ప్రకారం ఐదు సంవత్సరాల కఠిన కారగార శిక్ష , రూ .3000/- ల జరిమానా మొత్తం 6000 జరిమానా చెల్లించాల్సిందిగా తీర్పు చెప్పారు.

రెండు శిక్షలు ఏకకాలంలో అనుభవించ వలెనని తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ ను అదనపు పబ్లిక్ ప్రాసి క్యూటర్ పివిడి లక్ష్మి నిర్వహించారు .కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్.ఐ. ఆర్. ప్రభాకర్, కోర్టు లైజాన్ ఆఫీసర్ నేరేడు వీరబాబు (కోర్టు డ్యూటీ ఆఫీసర్) పిసి కె.వీరన్న లు సహకరించారు.