calender_icon.png 16 November, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్ధరాత్రి చలిలో పోలీసుల విధులు

16-11-2025 04:19:01 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): ఎముకలు కొరికే చలిలో పోలీసు సిబ్బంది  బందోబస్తును పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శనివారం అర్ధరాత్రి తర్వాత రెండు గంటల తర్వాత రెండు గంటల ప్రాంతంలోతనిఖీలు చేపట్టారు. కామారెడ్డి నరసన్నపల్లి బైపాస్ చౌరస్తా, సిరిసిల్ల రోడ్డు బైపాస్ చౌరస్తా, నిజాంసాగర్ రోడ్డు చౌరస్తా లో టేక్ రియల్ చౌరస్తా, రామారెడ్డి రోడ్ లలో పోలీస్ సిబ్బంది రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు.

వాహనాల్లో కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చేవారిని, కామారెడ్డి నుంచి వెళ్లే వారికి తనిఖీలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు తనిఖీలు చేపడుతున్నారు. అర్ధరాత్రి చలి నీ లెక్కచేయకుండా పోలీస్ సిబ్బంది తనిఖీ లు చేపడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకు ఎముకలు కోరికే చలిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి వాటర్ బాటిల్లతో సహా ఎస్పీ రాజచంద్ర తన ఇంట్లో టీ కాఫీ తయారు చేసి సిబ్బందికి అందజేశారు. సిబ్బంది చలికి ఇబ్బందులు పడుతూ వీధులు నిర్వహించడం చూసి ఎస్పీ రాజేష్ చంద్ర సిబ్బంది సేవలను బేష్ అంటూ కొనియాడారు.

సిబ్బందికి ఎస్పి రాజేష్ చంద్ర స్వయంగా టి కప్పులను వాటర్ బాటిల్లను అందజేయడంతో పోలీస్ సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎప్పుడు కూడా ఇలా పోలీస్ సిబ్బంది సేవలను ఉన్నతాధికారి మెచ్చుకోవడం నేర్చుకోవడం చూడలేదని పోలీస్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. కష్ట పడే వారికి మరింత ప్రోత్సాహం ఇలా చేస్తే కలుగుతుందని పోలీస్ సిబ్బంది, అధికారులు పేర్కొన్నారు. అర్ధరాత్రి తనిఖీలు కోసం వెళ్లిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఇబ్బంది చలిలో కూడా విధులు నిర్వహించడం పట్ల వారి సేవలను అభినందించారు.