calender_icon.png 16 November, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవా భావంతో సమాజానికి మేలు చేయాలి..

16-11-2025 04:54:34 PM

ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంను ప్రారంభించిన అదనపు ఎస్పీ మహేందర్ 

పాపన్నపేట (విజయక్రాంతి): సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయం చేయాలనే దృక్పథంతో ఉండాలని మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంను మల్లంపేటలో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. సమాజంలో ఇతరులకు సేవ చేయడం అనేది కేవలం స్వచ్ఛంద సంస్థల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యతని, తమవంతుగా ఇతరులకు సహాయం చేయాలని సూచించారు.

ఎన్ఎస్ఎస్ వాలంటరీగా చాలా విషయాలు తెలుసుకోవడానికి ఈ క్యాంపు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 13 క్యాంపులలో ఎన్ఎస్ఎస్ వాలంటరీగా నేను కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ చైర్మన్ నర్సింలు, ప్రోగ్రాం ఆఫీసర్ జూలకంటి శ్రీనివాస్, అధ్యాపకులు ప్రవీణ్, సంతోష్, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.