calender_icon.png 16 November, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో సారీ మానవత్వం చాటుకున్న మంత్రి శ్రీధర్ బాబు

16-11-2025 04:16:39 PM

మంథని,(విజయక్రాంతి): మరో సారీ గొప్ప మానవత్వం చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి సకాలంలో వైద్యం అందేలా చొరవ తీసుకొని నిండు ప్రాణాన్ని కాపాడారు. స్థానికుల వివరాల ప్రకారం మంథని నియోజకవర్గంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం శివారులో గల పెట్రోల్ పంపు దగ్గర శనివారం సాయంత్రం ప్రధాన రహదారిపై బైక్ ను టిప్పర్ ఢీకొట్టింది. 


ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాద సమయంలో మంథని నియోజకవర్గం లోని కాటారం మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని అటుగా వెళ్తున్న మంత్రి శ్రీధర్ బాబు తన కాన్వాయ్ ను వెంటనే నిలిపి వేసి, వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. క్షతగాత్రులను కలిసి మనోధైర్యం చెప్పారు. దీంతో మంత్రి శ్రీధర్ బాబుకు ఉన్న మానవత్వ స్పూర్తిని స్థానికులు కొనియాడారు.