calender_icon.png 27 October, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్యాపేటలో పోలీస్ అమరవీరుల సంస్మరణ ర్యాలీ

27-10-2025 07:49:39 PM

సూర్యాపేట (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా అమరవీరుల సంస్మరణ క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ నరసింహ ప్రారంభించగా పీఎస్ఆర్ సెంటర్ నుండి సంతోష్ బాబు చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని పోలీసు త్యాగాలను ప్రజలు గుర్తించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.