27-10-2025 07:57:49 PM
మోర్తాడ్ (విజయక్రాంతి): హైదరాబాద్ లోని బీసీ రిజర్వేషన్స్ ల సాధనకు సాగుతున్న మహాధర్నాకు మద్దతుగా నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం ఎంఆర్ఓ కృష్ణకు బీసీ ఎస్సీలు నివేదిక సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలతో కల్సిఅఖిల పక్షంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 9 షెడ్యూల్డ్ లో చేర్చేలా చేయాలనీ కోరారు. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్ లో పెట్టి పాస్ చేయాలనీ మోర్తాడ్ బీసీ ఎస్సి సంఘాలు డిమాండ్ చేశారు.
స్థానిక తెలంగాణ బీజేపీ నాల్గురు ఎంపీలు బీసీ రిజర్వేషన్ల కోసం పదవులకు రాజీనామా చేసి తాము బీసీలవైపు ఉన్నట్లు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్స్ సాధన సమితి నాయకులు నర్సన్న మేదరి, రాజకుమార్ గంగపుత్ర, ఏ. పీతంబారి పద్మశాలి, కె. తిరుపతి నాయి, గట్టు భారత్ మేదరి, తోట భూమన్న మహారాజ్, జంభావ చమార్, పేపర్ భూమన్న మహారాజ్, మామిడి సాగర్, రాజేందర్, మల్లూరి రాజారాం, జర్నలిస్ట్ మామిడి రాజు, టి. ప్రవీణ్ కుమార్, మూలనివాసి మాలజీ పాల్గొన్నారు.