14 June, 2026 | 1:45 AM

విద్యార్థులు అద్భుతమైన ఆవిష్కరణలతో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

14-06-2026 12:00 AM
  1. నవ కల్పనలకు వేదికగా ఎంఆర్ హబ్ స్టార్ట్ అప్ 2026ను ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
  2. మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో స్టార్టప్ హబ్ ప్రారంభం యువతకు సరికొత్త అవకాశాలు
  3. ఆలోచనలకు పదును పెట్టండి సరికొత్త స్టార్టప్‌లను సృష్టించండి: ఎమ్మెల్యే మల్లారెడ్డి పిలుపు

మేడ్చల్ అర్బన్, జూన్ 13 (విజయక్రాంతి): నిరుద్యోగ యువత కేవలం ఉద్యో గాలను సాధించడమే కాకుండా సరికొత్త ఆలోచనలతో ఆవిష్కరణలు చేస్తూ సమాజానికి ఉపయోగపడే పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని మేడ్చల్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టి శాసన సభ్యులు మాజి మంత్రి చామకూర మల్లారెడ్డి యువతకు పిలుపునిచ్చారు.

మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని గుండ్లపోచంపల్లి మున్సిపల్ డివిజన్ మైసమ్మగూడ లోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణం లో శనివారం నిర్వహించిన‘MR హబ్ స్టార్ట్ అప్ 2026‘ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి హబ్ను ఘనంగా ప్రారంభిం చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ మల్లారెడ్డి విద్యా సంస్థలు ఎల్లప్పుడూ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి సృజనాత్మకతను వెలికితీయడానికి ప్రాధాన్యతని స్తాయని పేర్కొన్నారు.

సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను యువత అందిపుచ్చుకోవాలనినూతన స్టార్టప్ల స్థాపనతో దేశ ప్రగతికి భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.విద్యార్థుల సరికొత్త ఐడియాలను ప్రాజెక్టులను వాణిజ్యపరమైన వ్యాపా రాలుగా మార్చేందుకు ‘MR హబ్‘అద్భుతమైన వేదికగా నిలుస్తుందని ఆయన ఆశాభా వం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో స్టార్టప్ హబ్ ద్వారా విద్యార్థులకు అవసరమైన మెంటార్షిప్ ల్యాబ్ వసతులు,సాంకేతిక సహకారం నిధుల అనుసంధానం వంటి సౌకర్యాలు లభిస్తాయని వర్సిటీ ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు, వర్సిటీ వైస్ ఛాన్సలర్,డైరెక్టర్లు,వివిధ విభాగాల డీన్ లు,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు...