15 April, 2026 | 6:44 AM

ఇన్ఫాయి కళాశాలలో పోలీసుల సంస్కరణ వేడుకలు

18-10-2025 12:00 AM

శంకర్ పల్లి అక్టోబర్ 17: శుక్రవారం ఇన్ఫాయి కళాశాలలో పోలీసుల సంస్కరణ దినోత్సవాన్ని  ఘనంగా నిర్వహించారు. సంస్కరణ దినోత్సవ సందర్భంగా ఐ సి.ఎఫ్.ఏ ఐ లా స్కూల్ హైదరాబాద్  బిజినెస్ జర్నలిజం క్లబ్ , ఐ నా ఫోటోగ్రఫీ క్లబ్, ద్వారా సంయుక్త రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యోగేష్ గౌతమ్ ఐపీఎస్ మోకిలా సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరబాబు హాజరయ్యారు.

ఆయన మాట్లాడుతూ సమాజంలో రక్త దానం యొక్క ప్రాముఖ్యతపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.రక్తదానం అనేది ప్రాణాలను కాపాడే మానవాలీకి పూర్తి బలోపేతం చేసే అత్యంత నిస్వార్థ చర్యలో ఒకటి అని ఆయన చెప్పారు క్రమం తప్పకుండా రక్తదానం చేయడంవల్ల శాస్త్ర చికిత్స లేదా ప్రాంతీయ అవసరమైన రోగులకు సహాయపడటమే కాకుండా క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా మద్దతు లభిస్తుందని ఆయన చెప్పారు.

పోలీసుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. మొకిల  సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు కూడా ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థులు ఇటువంటి మానవత ప్రయోజనాల కోసం ముందుకు రావాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫాయ్  స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ప్రొఫెసర్ రవి, శేఖర్, రాజు ,సమక్షంలో సత్కరించారు.

డాక్టర్ ప్రతాపరెడ్డి డిఎన్ మరియు డాక్టర్ ఏ అరుణ్ కుమార్ అసిస్టెంట్ డిఎన్ స్టూడెంట్ ఆక్టివిటీస్ విద్యార్థులు మరియు ఆధ్యాత్మిక సభ్యులు ఉత్సాహంగా పాల్గొనడాన్ని వారు అభినందించారు. రక్తదానం   మరియు సామాజిక అవగాహనను ప్రతిభందిస్తుందని చెప్పారు.

ఈ కార్యక్రమాన్ని బిజినెస్ జర్నలిజం క్లబ్ ఫ్యాక్టరీ కోఆర్డినేటర్ డాక్టర్ కస్తూరి పావని మరియు అయిన ఫోటోగ్రఫీ క్లబ్ ఫ్యాక్టరీ కోఆర్డినేటర్ డాక్టర్ కొండేరు రాకేష్ సమన్వయం చేశారు. ఈ శిబిరంలో విద్యార్థులు ఆధ్యాపకులు మరియు సిబ్బంది చురుగ్గా పాల్గొనడం ద్వారా ఒక్క పిన్ రక్తం మూడు ప్రాణాలను కాపాడుతుందని సందేశాన్ని బలోపేతం చేశారు.