18-10-2025 12:00:00 AM
ఘట్‌కేసర్, అక్టోబర్ 17 (విజయ క్రాంతి) : వెంకటాపూర్‌లోని అనురాగ్ యునివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఐ.ఈ.ఈ.ఈఆర్.ఏ. ఎస్ అండ్ ఎన్.టీ స్టూడెంట్ చాప్టర్ క్యాడ్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 30గంటల నేషనల్ లెవెల్ హ్యాకథాన్ ‘మెకోవేట్‘ మొదలైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి. వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ హెచ్.ఆర్ ఎవినియోన్ ఇండియా (ప్రైవేట్ లిమిటెడ్) విచ్చేసి ముఖ్య ప్రసంగాన్ని ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వారి ఓటములని ప్రేమించి ప్రేరణతో సక్సెస్ అవ్వాలని, ఇంజనీర్లు వ్యాపార దృక్పథం అలవాటు చేసుకోవాలని అన్నారు. ఇలాంటి హ్యాకథాన్ లలో పాల్గొని వచ్చిన ఆలోచనలను వదిలేయకుండా, సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలను అందించాలన్నారు. ఈ హకథాన్‌కు దేశంలోని వివిధ రాష్ట్రాల 180 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
కార్యక్రమ ప్రారంభానికి వైస్ ఛాన్సలర్ అర్చన మంత్రి, డీన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డాక్టర్ వి.విజయ్‌కుమార్, పల్లా అనురాగ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, స్ట్రాటజీ, డాక్టర్ యం.డి.సికిందర్ బాబా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, డాక్టర్ కె.శ్రీనివాస చలపతి మెకానికల్ విభాగ అధిపతి అసోసియేట్ డీన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్, హ్యాకథాన్ కో-కన్వీనర్ డాక్టర్ పి.సరిత అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.