calender_icon.png 30 December, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాకూ పీపీటీకి అవకాశం ఇవ్వండి

30-12-2025 01:38:07 AM

స్పీకర్‌ను కోరిన బీఆర్‌ఎస్ సభాపక్షం

ప్రజెంటేషన్‌కు అనుమతిస్తేనే చర్యకు న్యాయమని విజ్ఞప్తి

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపో తల ప్రాజెక్టు, నదీ జలాలకు సంబంధించిన అంశాలపై అసెంబ్లీలో నిర్వహించనున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు తమకూ అవకాశం కల్పించాలని బీఆర్‌ఎస్ సభాపక్షం కోరింది. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఆయన ఛాం బర్‌లో బీఆర్‌ఎస్‌ఎల్పీ నేతలు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి తదితర నేతలు వినతిపత్రం అందజే శారు.

ఈ వినతిని స్పీకర్ పరిశీలనకు తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సభ లో బీఆర్‌ఎస్ శాసనసభా పక్షానికి పవర్ పా యింట్ ప్రసెంటేషన్ (పీపీటీ)కి అవకాశం కల్పించాలని నేతలు కోరారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సహా నదీ జలాలకు సంబంధించిన అంశాలపై చర్చ సందర్భంగా ప్రభుత్వ పరంగా ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసిందన్నారు.

ప్రభుత్వానికి పీపీటీ అవకాశం ఇచ్చినప్పుడు బీఆర్‌ఎస్‌కు కూడా ప్ర జెంటేషన్‌కు అనుమతిస్తేనే చర్చకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు నీళ్ల కు సంబంధించిన నిజాలు తెలియాలంటే ఆధారాలను డాక్యుమెంట్లు, వీడియోల రూ పంలో లోతుగా వివరించాలన్నారకు.

బీఆర్‌ఎస్‌ఎల్పీ ప్రతిపాదిస్తున్న అంశాలు

* రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు -యూరియా కొరత, రుణమాఫీ పంట బోన స్ పెండింగ్ బకాయిలు, రైతు భరోసా, రైతు ఆత్మహత్యలు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారెంటీలు రెండేళ్ల పాలన పూర్తయినా అమలు కాని తీరు -అన్ని వర్గాలకు జరిగిన మోసాలు 

* ఫార్మా సిటీ రద్దు, ఫ్యూచర్ సిటీ పేరుతో భూముల ధారాదత్తం

* కొత్త థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం తెచ్చిన పాలసీలో జరిగిన అవినీతి 

* బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పై ప్రభుత్వ తప్పిదాలు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇవ్వాల్సిన ఉద్యోగ నోటిఫికెషన్లలో జాప్యం 

* ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ర్ట ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి.. -ఐదు డీఏలు, పీఆర్సీ చెల్లింపులో జాప్యం, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిల విడుదలలో నిర్లక్ష్యం 

* పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపడం.. -45 టీఎంసీలు చాలని    రాష్ర్టప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి, రాష్ర్ట ప్రయోజనాలకు విఘాతం కలిగించిన తీరు 

* హిల్ట్ పాలసీతో ఐదు లక్షల కోట్ల కుంభకోణం -ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెడుతున్న తీరు 

* గురుకులాల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం -126 కి పైగా విద్యార్థుల మరణాలు 

* గ్రేటర్ హైదరాబాద్‌లో 22 మున్సిపాలిటీల విలీనం -అశాస్త్రీయంగా జరిగిన విలీన ప్రక్రియ, హైడ్రా విపరీత పోకడలు పేదల ఇళ్ల పై ప్రతాపం -బుల్డోజర్ పాలన 

* ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్పుతో రైతులకు జరుగుతున్న ఇబ్బందులు, -రాష్ర్ట ప్రయోజనాలకు

  నష్టం కలిగిస్తున్న ప్రభుత్వ విధానం 

* రాష్ర్టంలో పెరుగుతున్న నేరాలు.. -శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యం 

* ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపును పెండింగ్‌లో పెట్టడంతో విద్యార్థులు పడుతున్న కష్టాలు