10-12-2025 12:44:48 AM
గ్రామాల్లో పర్యటిస్తున్న డీఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్లు
సమస్యాత్మక గ్రామాల ప్రజలతో ప్రత్యేక సమావేశాలు
మణుగూరు,డిసెంబరు9(విజయక్రాంతి) : పంచాయతీ ఎన్నికలను ప్రశాంతం గా నిర్వహించడానికి సబ్ డివిజన్ పోలీసు లు ప్ర త్యేక దృష్టి సారించారు. డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి ఆదేశాలతో అధికా రులు పూర్తి స్థా యిలో కసరత్తు చేస్తున్నా రు. గ్రామాలఫై పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. గ్రా మాల్లో ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు జరగకుండా ముం దస్తు ప్రణాళిక రూపొందించారు.
ఇందు లో భాగంగా ఘర్షణలు, గొడవలు సృష్టిం చే వారిపై దృష్టి సారిస్తున్నారు. సబ్ డివి జన్ పోలీస్ స్టేషన్ ల పరిధిలోని సమ స్యాత్మక గ్రామాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ బహు మతులు, మద్యం, నగదు తదితర వా టి ని పంపిణీ చేయకుండా సరిహద్దుల్లో చెక్ పోస్టులతో పాటు గ్రామాల్లో తనిఖీ నిర్వహిస్తున్నారు.
శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ పై ఫోకస్...
పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో సున్ని తమైన అంశం కావడంతో పాటు రాజకీ యాలకు అతీతంగా జరుగుతుండటంతో గొడవలకు తావు ఇవ్వకుండా జాగ్రత్తలు తీ సుకుంటున్నారు. పినపాక అసెంబ్లీ ని యో జకవర్గంలో అధికార, ప్రతిపక్ష రాజకీ య పార్టీలకు చెందిన బలమైన రాజకీయ ప్రత్యర్థులు ఉండటంతో గత నెలలో మణుగూ రులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్య కర్తల మధ్య జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని ప్ర శాంతంగా ఎన్నికల నిర్వహ ణ కోసం పోలీసులు వ్యూహత్మకంగా జాగ్రత్తలు తీసుకుం టున్నారు.
ఇందులో భాగంగా పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాల్లోని సమ్యస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాల పై ప్రధా న దృష్టి సారిం చారు. ఈ నెల 11 న జరిగే మొదటి విడ త పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఈసీ ని బంధనలు అమలయ్యేలా, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకు నేలా, రాజకీయ, వ్యక్తిగత ఘర్షణలకు తావులేకుండా, పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు చోటు చేసు కుండా ఇప్పటి నుం చే పటిష్టమైన నిఘా పె ట్టారు.
శాంతియుతంగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయ టానికి అన్ని విధా లుగా గ్రామాల పై పోలీసు అధికారులు స్పెషల్ ఫోకస్ చేశారు. కొద్ది రోజులుగా డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి,సీఐ లు, ఎస్ ఐ లతో పాటు కలిసి గ్రామాల్లో పర్యటిస్తు న్నారు. గ్రామ ప్రజలు, పోటీ చేస్తున్న అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల నిబంధనల నియమావళి అమ లు, ప్రశాంత వా తావరణంలో అందరూ ఓటు హక్కు ఉపయోగించుకునేలా అవ గాహన కల్పిస్తున్నా రు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా పరిశీలిం చి కట్టుదిట్టమైన బందోబస్తు కోసం ఏర్పా ట్లు చేసేలా సూచనలు చేస్తున్నారు.
ఎన్ని కల నిబంధనలను ఉల్లంఘించే వారి పై, శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారి చట్టపరంగా తీసుకునే చర్యల గురించి వివరిస్తున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా అందరూ సహకరించాలని కోరు తున్నారు. మరో వైపు కట్టుదిట్టమైన భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 11న జరిగే తొలి విడత ఎన్నికల్లో సబ్ డివిజన్లోని అశ్వాపురం, బూర్గం పాడు,మణుగూ రు, పినపాక, కరకగూడెం మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఆయా మండలాలతో పాటు గ్రామాలలో పోలీసు పహారాలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా డీఎస్పీ వంగా రవీం దర్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా రు. మరోవైపు సమస్యాత్మక గ్రామాల్లో ఎన్నికలు సజావుగా జరిగేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.