10-12-2025 12:44:18 AM
వాసుకీ ఖాన్ పేరుతో అధికారులకు ఈ-మెయిల్
అని తేల్చిన అధికారులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 9 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని ముఖ్యమంత్రి కార్యాలయం, గవర్నర్ నివాసం లోక్‌భవన్‌లను బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరింపులు రావడం అధికార యంత్రాంగం లో అలజడి సృష్టించింది. మంగళవా రం ఉదయం వచ్చిన ఓ ఈ-మెయిల్ పోలీసులను పరుగులు పెట్టించింది. ఉదయం గవర్నర్ కార్యాలయంతో పాటు సీఎంవోకు వాసుకీ ఖాన్ అనే పేరుతో ఒక ఈ-మెయిల్ వచ్చింది.
సీఎం వో, లోక్‌భవన్‌లలో శక్తివంతమైన బాంబులు అమర్చాం.. అవి త్వరలోనే పేలిపోతాయి అని ఆగంతుకుడు అందు లో పేర్కొన్నాడు. అధికారులు అప్రమత్తమయ్యారు. గవర్నర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాస్ హుటాహుటిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగానే పోలీసులు కేసు నమోదు చేశారు.
బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ , యాంటీ-సబోటేజ్ టీమ్స్, డాగ్ స్క్వాడ్, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగి, రెండు భవనాల ప్రాంగణాల్లో సుమారు 3 గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల అనంతరం ఎలాంటి బాంబులు గానీ, అనుమానాస్పద వస్తువులు గానీ లభించలేదని పోలీసులు నిర్ధారించారు.