calender_icon.png 12 October, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరి

12-10-2025 05:35:37 PM

బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ శైలజ..

మేలిపల్లి (విజయక్రాంతి): 0-5 సంవత్సరాల పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరి వేయించాలని బోడుప్పల్ నగరపాలక సంస్థ కమిషనర్ శైలజ అన్నారు. ఆదివారం నాడు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచర్లలో 2, బోడుప్పల్ లో 17 కేంద్రాలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రములలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంను బోడుప్పల్ కమీషనర్ శైలజా మెడికల్ ఆఫీసర్స్, మున్సిపల్ అధికారులతో కలిసి మున్సిపల్ కార్యాలయం, పోలియో కేంద్రములో చుక్కలు వేసే కార్యక్రమమును ప్రారంభించారు.

పారిశుధ్య సిబ్బందితో అవసరమైన ఏర్పాట్లు, సదుపాయలు గురించి సమీక్ష సమావేశం నిర్వహించడం నిర్వహించి, అనంతరం పోలియో కేంద్రములలో 0-5 సంవత్సరాలు గల పిల్లలకు పోలియో చుక్కలు వేసారు. ఈ సందర్బంగా కమీషనర్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని పోలియో చుక్కలు వేయించడం మనందరి బాధ్యతగా భావించి ప్రజలలో మరింత అవగాహన కల్పించాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రణీత్, మునిసిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్ రెడ్డి, సంగీత, మెడికల్ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.