11-02-2026 12:02:55 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో పోలింగ్ సందడి మొదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ఆయా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివెళ్లి ఓటు వేశారు. 68 పోలింగ్ కేంద్రాల్లో 8 గంటల లోపే పోలింగ్ కేంద్రాల్లోకి ఓటర్లు బారులు తీరు కనిపించారు. మహిళలు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు ఓటు వేసేందుకు తండోపతండాలుగా వెళ్లారు.
బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును పర్యవేక్షించారు. ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను పోలీసు ఉన్నత అధికారులు సమీక్షిస్తున్నారు.