21 August, 2026 | 7:47 AM

పీఆర్‌టీయూలో శేరీకర్ రమేష్‌దే హవా

21-08-2026 01:45 AM

అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక

నాగల్ గిద్ద, ఆగస్టు 20 : నాగల్ గిద్ద మండల పీఆర్టీయూ సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా శేరీకర్ రమేష్, ప్రధాన కార్యదర్శిగా జీవన్రావు పాటిల్ ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడు ఆకుల మానయ్య, ప్రధాన కార్యదర్శి ఆకుల మధు, గౌరవ అధ్యక్షుడు తులసిరామ్ రాథోడ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.

ఈ సందర్భంగా శేరీకర్ రమేష్ మాట్లాడుతూ రెండోసారి తనను మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి జీవన్రావు పాటిల్ లను ఉపాధ్యాయులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్ర మంలో పిఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిరాదర్ రవీందర్రావు, సూర్యకాంత్ బసవరాజు, సంఘం నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.