21 August, 2026 | 6:08 AM

కలెక్టరేట్‌ను ముట్టడించిన పాలిటెక్నిక్ విద్యార్థులు

21-08-2026 01:46 AM

జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ 

మంచిర్యాల క్రైమ్, ఆగస్టు 20 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ బోర్డ్ ఎస్బీటీఈటీని శక్తి స్కీమ్ లో విలీనం చేసేందుకు తీసుకొచ్చిన జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురు వారం సింగరేణి పాలిటెక్నిక్ విద్యార్థులు కలెక్టరేట్ ను ముట్టడించారు. విద్యార్థుల ఆందోళనకు వామపక్ష విద్యార్థి సంఘాల(పీడీఎస్ యూ, యూఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్ బి)తో పాటు నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ (ఎన్‌ఎస్‌ఎఫ్) నాయకులు మద్దతు ప్రకటించి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణిని మానుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఐటిఐ పూర్తి చేసిన విద్యార్ధులకే ఉద్యోగాలు కల్పించలేక నిరుద్యోగులుగా మిగులుతున్న ఈ సమయంలో ఇంజినీరింగ్, ఏదైనా ప్రోగ్రామింగ్ నేర్చుకొని లేదా సాఫ్ట్వేర్ సైడ్ లేదా ఇంజినీరింగ్ చేసుకొని జీవితంలో మంచి ఉన్నతస్థాయిలో ఉండాలనే విద్యార్థులను తీసుకొచ్చి శక్తిలో కలిపి వీళ్లను కూడా కాబోయే నిరుద్యోగులుగా మర్చాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు.

ఈ విషయంపైన రాష్ట్ర ప్రభుత్వం తమ మొండి వైఖరిని విడిచిపెట్టి జీవో 97ని వెంటనే రద్దు చేసి ఎస్బీటీఈటీని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రామ్ ప్రసాద్, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు శ్రీకాంత్, సన్నీ గౌడ్, తిరుపతి, రాకేష్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.