27-10-2025 12:00:00 AM
నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి
చిట్యాల, అక్టోబర్ 26(విజయ క్రాంతి ): యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాలని నల్లగొండ డిఎస్పి కొలను శివరాం రెడ్డి అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో ఆదివారం యువశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కీ.శే సిలివేరు చంద్రశేఖర్, కీ.శే కంబాలపల్లి నరేష్ ల జ్ఞాపకార్ధం ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని నల్లగొండ డిఎస్పి ప్రారంభించి మాట్లాడారు.
రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని, మనం చేసే రక్తదానం ఆపద సమయాల్లో మరొకరికి సహాయపడుతుందని అన్నారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అని ఈ సందర్భంగా యువశక్తి యువజన సంఘం కి అభినందనలు తెలిపారు. సంఘం అధ్యక్షుడు ఐలపురం నరేష్ మాట్లాడుతూ మా సంఘం సభ్యులు కీ.శే లు ఎస్. చంద్రశేఖర్, కె.నరేష్ ల జ్ఞాపకార్ధం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందనీ, మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని అన్నారు.
కాగా నల్లగొండ అపర్ణ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో దాదాపు 40 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు ఎస్కే ఇబ్రహీం, ప్రధాన కార్యదర్శి మద్దిమధు, కార్యనిర్వహక అధ్యక్షుడు గుండ్లపల్లి వెంకన్న, కార్యదర్శి చింతపల్లి ప్రవీణ్, కోశాధికారులు సిలివేరు పరమేష్, బొడ్డుపల్లి శ్రీను, బొడ్డుపల్లి ఉపేందర్, సభ్యులు ఆవుల మహేష్, నిమ్మనగోటి శ్రీనివాసు, ఏరుకొండ వెంకటేష్, సిలివేరు రిశ్వంత్, యాదాసు రామ్, బోడిగే శ్రవణ్, కంబాలపల్లి ప్రవీణ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.