calender_icon.png 20 August, 2025 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పడకేసిన పారిశుద్ధ్యం

20-08-2025 01:46:18 AM

  1. జాడలేని శానిటేషన్ సిబ్బంది
  2. విష జ్వరాల బారిన పడుతున్న స్థానికులు
  3. పట్టించుకోని అధికారులు
  4. రెండు రోజుల్లో చెత్త కుప్పలు తొలగిస్తాం
  5. ముషీరాబాద్ సర్కిల్ డీఎంసీ రామానుజులరెడ్డి

ముషీరాబాద్, ఆగస్టు 19(విజయక్రాంతి): ముషీరాబాద్ లో పారిశుధ్యం పడకేసింది. ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్ప లు ఇబ్బడి ముబ్బడిగా పడి ఉండడంతో స్థానికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  చెత్తను ఎప్పటికప్పుడు తొలగిం చాల్సిన శానిటేషన్ సిబ్బంది పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో స్థానిక ప్రజలు  ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. కుళ్ళిన వ్య ర్ధాలతో కూడిన చెత్త కుప్పల వల్ల కాలనీలు, బస్తీలన్నీ కంపు కొడు తున్నాయి.

ముషీరాబాద్ సర్కిల్- 15 పరిధిలోని కవాడిగూడ, భోలక్ పూర్, గాంధీనగర్, ముషీరా బాద్, అడిక్మెట్, రాంనగర్ డివిజన్లోని ఆయా బస్తీలు కాలనీలలోని ప్రధాన కూడళ్లలో  చెత్తకుప్పలు గుట్టలుగా దర్శనమిస్తున్నప్పటికిని అధికారులు పట్టించుకోవ డంలేదని స్థానికులు వాపోతున్నారు.  అధికారు ల అలసత్వం,  ప్రజాప్ర తినిధుల పర్యవేక్షణ లోపం తో బస్తీలు కాలనీలన్నీ చెత్తమయంగా మా రాయని స్థాని క ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాన కూడళ్లలో పేరుకు పోయిన చెత్త కుప్పలు కుళ్ళిపోవడంతో దోమలు వృద్ధి చెంది అనారోగ్యాల బారిన పడుతు న్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్యాన్ని  పట్టించుకోవాల్సిన శానిటేషన్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. 

వర్షాకాలం.. చెత్త దుర్గంధం

గత వారం పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడుగా నియోజకవర్గంలోని ఆయా డివిజన్లో గల బస్తీలు కాలనీలలో చెత్తకుప్పలు కుప్పలు తెప్పలుగా  పేరుకుపోవడంతో అనారోగ్యాల మారిన పడుతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడబడితే అక్కడ చెత్త కుప్పలు దర్శన మిస్తున్నప్పటికిని అధికారుల కంటికి కనబడడం లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయమై సంబంధిత జిహెచ్‌ఎంసి అధికారులకు ఎన్నో మార్లు ఫిర్యాదు చేసిన ప్పటికిని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని   నియోజకవర్గంలో పేరుకుపోయిన చెత్త కుప్పలను వెంటనే తొలగించి ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 

రెండ్రోజుల్లో చెత్తను తొలగిస్తాం

గత రెండు మూడు రోజుల నుంచి రామ్ కి సంస్థ వారు చేస్తున్న స్ట్రైక్ వలన చెత్తకుప్పల  తొలగింపు నిలిచి పోయింది. నియోజకవర్గంలో ఆయా డివిజన్లోని బస్తీలు, కాలనీలలో పేరుకు పోయిన చెత్త కుప్పలను రెండు రోజు ల్లో తొలగించి ప్రజల ఇబ్బందులను తొలగిస్తాం.

 రామానుజులరెడ్డి,ముషీరాబాద్ సర్కిల్ 15 డిఎంసీ