calender_icon.png 20 August, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఎస్‌ఆర్ గ్రూప్‌పై ఐటీ దాడులు

20-08-2025 01:28:54 AM

  1. మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి ఇంట్లో సోదాలు
  2. హైదరాబాద్, బెంగళూరు సహా 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు
  3. ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారుల ఆరా

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 19 (విజయ క్రాంతి): ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ డీఎస్‌ఆర్ గ్రూప్ కన్‌స్ట్రక్షన్ సంస్థపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు మంగళవారం తెల్లవారుజాము 5 గంటల నుంచి దాడులు ప్రారంభించారు.  సీఆర్‌పీఎఫ్ బలగాల పటిష్ట బందోబస్తు మధ్య 15 ఐటీ బృందాలు ఈ మెగా ఆపరేషన్‌ను ప్రారంభించాయి. పన్ను ఎగ వేత, లెక్కల్లో చూపని భారీ ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు వచ్చిన పక్కా సమాచారంతో హైదరాబాద్, బెంగళూరు, నెల్లూరులోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

ఈ సంస్థతో ఆర్థిక సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి నివా సంలోనూ తనిఖీలు చేశారు. డీఎస్‌ఆర్ గ్రూప్ కా ర్పొరేట్ కార్యాలయంతో పాటు, సంస్థ సీఈవో స త్యనారాయణరెడ్డి, ఎండీ సుధాకర్‌రెడ్డి, ఎగ్జిక్యూటి వ్ డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఇళ్లలోనూ విస్తృతంగా సో దాలు చేపట్టారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్‌ఆర్ నగర్, సూరారంలోని కార్యాలయాలు, నివాసాలతో పాటు, బెంగళూరు, నెల్లూరు నగరాల్లోని సంస్థ కార్యాలయాలు, అనుబంధ సంస్థలపై కూడా ఏకకాలంలో దాడులు కొ నసాగాయి. గత కొన్నేళ్లుగా డీఎస్‌ఆర్ గ్రూప్ సమర్పించిన ఐటీ రిటర్నులకు, వాస్తవ లావాదేవీలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఐ టీ శాఖ గుర్తించినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా, ప్రాజెక్టుల నిర్మా ణంలో బోగస్ కాంట్రాక్టులు, ఖర్చులను ఎక్కువ గా చూపడం, భూముల కొనుగోళ్లకు సంబంధించి లెక్కల్లో చూపని నగదు చెల్లింపులు వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. సోదాల్లో భాగంగా హార్డ్‌డిస్కులు, ల్యాప్ టాప్‌లు, అకౌంటింగ్ రికార్డులు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. 

మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి నివాసంలో తనిఖీలు

 దాడుల్లో అత్యంత కీలకాంశం చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి నివాసంలో సోదాలు జరగడ మే. హైదరాబాద్‌లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఆయన నివాసానికి ఉదయాన్నే చేరుకున్న ఐటీ బృందాలు తనిఖీలు ప్రారంభించాయి. డీఎస్‌ఆర్ గ్రూప్ చేపట్టిన పలు ప్రాజెక్టులలో రంజి త్‌రెడ్డికి పెట్టుబడులు ఉన్నట్లు, ఆయనకు, సంస్థ యాజమాన్యానికి మధ్య భారీగా ఆర్థిక లావాదేవీ లు జరిగినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నా రు. ఈ నేపథ్యంలో, వారి మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు, నిధుల మళ్లింపు వంటి కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.