calender_icon.png 22 July, 2025 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదక ద్రవ్యాలకు యువకులు దూరంగా ఉండాలి..

22-07-2025 04:32:12 PM

మత్తు పదార్థాలు, నిషేధిత యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై చట్టరీత్య చర్యలు..

మునుగోడు ఎస్సై ఇరుగు రవి..

మునుగోడు (విజయక్రాంతి): గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు ఆన్లైన్ బెట్టింగ్స్, లోన్ యాప్ లకు విద్యార్థులు, యువకులు దూరంగా ఉండాలని మునుగోడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇరుగు రవి(SI Irugu Ravi) అన్నారు. డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈనెల 24 నుంచి ఆగస్టు రెండు వరకు నిర్వహించే సైకిల్ యాత్ర పోస్టర్ను డివైఎఫ్ఐ నాయకులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. సమాజ మార్పు కోసం, డ్రగ్స్ ను గంజాయిని అరికట్టాలని జిల్లా వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేస్తున్న డివైఎఫ్ఐ కమిటీకి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం సమాజాన్ని డ్రగ్స్ అనే మహమ్మారి పట్టిపీడిస్తుందని ఈ మహమ్మారిని అరికట్టడానికి పోలీస్ శాఖ అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్న చర్యలను గుర్తు చేశారు. తెలిసి తెలియకుండా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి పోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకుని అనేకమంది యువకులు 30 ఏళ్ల లోపు వాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన సంఘటనను గుర్తు చేశారు.

ఎలాంటి లోన్ యాప్ లకు, బెట్టింగ్ యాప్ లకు విద్యార్థులు, యువకులు అలవాటు పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. విద్యార్థులు, యువకులు చెడు మార్గంలో ప్రయాణించడం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయి ఆర్థికంగా, మానసికంగా నష్టపోవడం జరుగుతుందని అన్నారు.డ్రగ్స్ గంజాయిని రవాణా చేస్తున్న వారిపై, నిషేధిత యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని వారిపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. మండలంలో ఎక్కడనైనా గంజాయి సేవిస్తున్నటువంటి సమాచారం ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి, మండల అధ్యక్షులు బొడ్డుపల్లి నరేష్, మండల కమిటీ సభ్యులు ఖమ్మంపాటి రవి, యాదయ్య, సురేందర్ ఉన్నారు.