calender_icon.png 22 July, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శభాష్ ఉత్పత్తుల మేళా..

22-07-2025 04:35:13 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం స్వయం సహాయక మహిళా సంఘం సభ్యులు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. ఉత్పత్తుల మేళాను బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్(Municipal Commissioner Thanniru Ramesh) రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వందరోజుల ప్రణాళికలో భాగంగా స్వయం సహాయక మహిళా గ్రూపులు 50వ రోజును విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. ఈ 50 రోజుల్లో తయారుచేసిన రకరకాల ఉత్పత్తులను మేళా ద్వారా తమ ప్రతిభ పాటవాలను చాటుకున్నారు. స్వయం సమృద్ధి కోసం మహిళల అభివృద్ధి కోసం తలపెట్టిన వంద రోజుల ప్రణాళిక కార్యక్రమం మహిళల్లో ఉత్పత్తుల తయారు నైపుణ్యతను అభివృద్ధి చేసిందని చెప్పవచ్చు. ఉత్పత్తుల మేళాలో మహిళా సంఘాల సభ్యుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వచ్చింది.

ఆహార ఉత్పత్తులు, వస్త్రాలు రకరకాల ఉత్పత్తులను స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు సభ్యులు ఈ మేళాలో ప్రదర్శించారు. ఉత్పత్తుల మేళాకు విశేషమైన స్పందన కనిపించింది. మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను సరసమైన ధరలకు విక్రయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. ఆహార ఉత్పత్తులు వస్త్రాలు ఇతర గృహోపకార వస్తువులను ఆయన చూశారు. ఉత్పత్తులు తయారీలో మహిళా సంఘాల సభ్యుల కమిషనర్ రమేష్ అభినందించారు. మిగిలిన 50 రోజులను కూడా మహిళా సంఘాల సభ్యులు ఇదే స్ఫూర్తితో మరి నువ్వు ఉత్పత్తులను తయారుచేసి వందరోజుల ప్రణాళికను పరిపూర్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో టీ ఎంసీ దుర్గయ్య, స్వయం సహాయక మహిళా సంఘాల ఆర్పీలు, సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.