28-08-2025 01:44:30 PM
విద్యార్థులకు గణిత పాఠాలు.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్(Nagarkurnool District Collector) బాదావత్ సంతోష్ గురువారం తెలకపల్లి మండలం కారువంగ జడ్పీ హై స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించి, 9వ, 10వ తరగతుల విద్యార్థులకు గణితం బోధించారు. గణితాన్ని సులభంగా అర్థమయ్యేలా నేర్పుతూ, గణితంపై భయంతో ఉండే వారిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం, పాఠశాల పరిశుభ్రత, మురుగు కాలువల సమస్యలను కూడా సమీక్షించారు. వర్షాల కారణంగా గదుల పైకప్పుల లీకేజీపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.