01-08-2025 09:58:17 PM
- శత శాతం కార్యక్రమం మహబూబ్ నగర్ నుంచే ప్రారంభం
- మహబూబ్ నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): విద్యాభివృద్ధి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని మహబూబ్ నగర్ కలెక్టర్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని ఐడిఓసి సమావేశ మందిరంలో మహబూబ్ నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శత శాతం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో తోలి సారిగా శత శాతం కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ నియోజకవర్గంలో అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి వద్దనే విద్యా శాఖ ఉందని, ఆయన పాఠశాల విద్య మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, వేల కోట్ల రూపాయలు విద్య పైన ఖర్చు చేస్తున్నారని ఆయన తెలిపారు.
గత పది సంవత్సరాలుగా పాఠశాల విద్యను విస్మరించారని, మన మహబూబ్ నగర్ పిల్లల భవిష్యత్తు కోసం వందేమాతరం ఫౌండేషన్ తో కలిసి మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఒక మంచి ఆలోచన తోటి శత శాతం కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ లో ప్రారంభం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎవరైతే వాలంటీర్స్ శత శాతం కార్యక్రమానికి ఎంపికైయ్యారో వారు ఒక లక్ష్యంతో పనిచేయాలని ఆయన సూచించారు. గతంలో 54% ఉన్న పదవ తరగతి వార్షిక ఫలితాలు డిసెంబర్ 3, 2023 తర్వాత, తాను ప్రతి పాఠశాల తిరిగి డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను అందించామని, దాని ఫలితంగా పదవతరగతి లో 85% ఫలితాలు సాధించామని గుర్తు చేశారు. త్వరలో నాగర్ కర్నూల్ ఎంపి మల్లు రవి గారు తన పార్లమెంటు నియోజకవర్గంలో ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ అందిస్తున్నారని ఆయన చెప్పారు.
ప్రస్తుతం 25 నియోజకవర్గాలలో డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను అందజేయడం జరుగుతుంది అని, త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి కృషి చేస్తానని ఆయన. మేము గత సంవత్సరం పయనీర్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా ఎప్సెట్ మరియు నీట్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగిందని ఎవరూ ఊహించని రీతిలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని 114 మంది పేద విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులలో ఉచితంగా ప్రవేశాలు పొందారని ఇది గొప్ప విజయం అని ఆయన చెప్పారు.
అలాగే వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలిసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం కూడా తాను సహకారం అందించి విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్ అందించామని ఆయన చెప్పారు. కేవలం పదవ తరగతి లో 100% ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయలేదని, అది కేవలం ఒక భాగం మాత్రమే అని, విద్యార్థులలో దాగిన సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడాలని ఆయన సూచించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ తో సంప్రదింపులు జరిపినట్లు ఆయన చెప్పారు. వారు ప్రతి పాఠశాలకు వచ్చి విద్యార్థులతో మమేకం అయి వారి యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఏనుగొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో మెంటర్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని త్వరలో నియోజకవర్గం మొత్తం మెంటర్స్ కార్యక్రమం విస్తరిస్తామని పేర్కొన్నారు.
సొంత నిధులతో ఉచిత విద్య గొప్ప విషయం : కలెక్టర్ విజయేందిర బోయి
నిరుద్యోగులకు నిరుపేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పాటు అందించడం గొప్ప విషయం అని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి(District Collector Viziendira Boyi) అన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని, అందులో భాగంగా పాలమూరు యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ కాలేజ్, లా కళాశాల మంజూరు చేయించారన్నారు. ఐఐఐటి కళాశాల ను మహబూబ్ నగర్ కు తీసుకువచ్చారని, ప్రతి పాఠశాలలో డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను తన సొంత నిధులతో ఉచితంగా అందించడం గొప్ప విషమన్నారు. చాలా పెద్ద విద్యా సంస్థలు మహబూబ్ నగర్ కు తెచ్చేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ సభ్యులు రవింధర్, అనిల్, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, డిఇఓ ప్రవీణ్ కుమార్, ఎఎంఓ దుంకుడు శ్రీనివాస్ వివిధ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.