calender_icon.png 2 August, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి పాలు తాగించాలి

01-08-2025 10:00:16 PM

జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి..

సూర్యాపేట (విజయక్రాంతి): బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి ముర్రుపాలను తాగించాలని జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి(District Welfare Officer Dayananda Rani) అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ సంయుక్తంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లోని ప్రసూతి విభాగంలో శుక్రవారం తల్లిపాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ.. తల్లి ముర్రుపాలను బిడ్డకు మొదటి టీకాగా అభివర్ణిస్తారని, వీటి ద్వారానే బిడ్డకు అధిక రోగ నిరోధక శక్తి అందజేయబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరిండెంట్ శ్రవణ్, పీడియాట్రీషియన్ శ్రీకాంత్, మహిళా శిశు సంక్షేమ శాఖ సిడిపిఓలు, సూపర్వైజర్లు, పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్లు, హాస్పిటల్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.